చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు | Lionel Messi Scripts History-Most Assists-FIFA World Cup Since-1966 | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు

Jul 12 2026 11:46 AM | Updated on Jul 12 2026 12:33 PM

Lionel Messi Scripts History-Most Assists-FIFA World Cup Since-1966

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా సూప‌ర్‌స్టార్ లియోన‌ల్ మెస్సీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్ప‌టికే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్న మెస్సీ తాజాగా స్విట్జర్లాండ్‌తో జ‌రిగిన క్వార్టర్ ఫైన‌ల్లో మ‌రో ప్ర‌పంచ రికార్డు అందుకున్నాడు. స్విట్జ‌ర్లాండ్‌తో మ్యాచ్‌లో గోల్ చేయ‌న‌ప్ప‌టికీ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. 

అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్‌కు 10వ నిమిషంలో పిన్‌పాయింట్ కార్న‌ర్ నుంచి అసిస్ట్ అందించాడు. ఈ నేప‌థ్యంలో ఫిఫా చరిత్ర‌లో అత్య‌ధిక అసిస్ట్‌లు అందించిన ఆట‌గాడిగా మెస్సీ రికార్డుల‌కెక్కాడు. అలిస్ట‌ర్‌కు అందించిన అసిస్ట్ మెస్సీకి ప‌దోది కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో అర్జెంటీనా దిగ్గ‌జం డీగో మార‌డోనా (8 అసిస్ట్‌లు) రికార్డును బ‌ద్దలు కొట్టిన మెస్సీ 10 అసిస్ట్‌ల‌తో తొలి స్థానంలో నిలిచాడు. 

1966 ఫిఫా ప్రపంచకప్‌ నుంచి చూసుకుంటే మారడోనా (1982, 1986, 1990, 1994 ఫిఫా వరల్డ్‌కప్స్‌) కలిపి 8 అసిస్ట్‌లు సాధించాడు. తాజాగా 32 ఏళ్ల తర్వాత మారడోనా రికార్డును మెస్సీ బద్దలుకొట్టడం విశేషం. మార‌డోనా 8 అసిస్ట్‌ల‌తో రెండో స్థానంలో, ఇక మూడో స్థానంలో జ‌ర్మనీ ప్లేయ‌ర్ పియెర్రె లిట్‌బార్స్కీ, పోలండ్ ప్లేయ‌ర్ జార్జ్ లాటో చెరో ఏడు అసిస్ట్‌ల‌తో సంయుక్తంగా ఉన్నారు. 

ఆరు అసిస్ట్‌లతో డేవిడ్‌ బెక్‌హమ్‌ (ఇంగ్లండ్‌), పీలే (బ్రెజిల్‌), థామస్‌ ముల్లర్‌ (జర్మనీ) నాలుగో స్థానంలో నిలిచారు. ఇక 1962లో వ‌రుస‌గా రెండోసారి చాంపియ‌న్స్‌గా నిలిచిన బ్రెజిల్ స‌ర‌స‌న చేరేందుకు అర్జెంటీనా మ‌రో రెండు అడుగుల దూరంలో ఉంది. 2022 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా ట్రోఫీ అందుకుంది. 

ఇక నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను అందుకోవాల‌నే దృడ సంక‌ల్పంతో ఉంది. జూలై 14న తొలి సెమీఫైన‌ల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్‌, జూలై 16న రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా త‌ల‌ప‌డ‌నున్నాయి. జూలై 20న ఫిఫా పైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement