IND vs NZ 3rd Test: ముంబై టెస్టులో టీమిండియా చిత్తు.. | India vs New zealand 3rd test live updates and highlights | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

IND vs NZ 3rd Test: ముంబై టెస్టులో టీమిండియా చిత్తు..

ముంబై టెస్టులో టీమిండియా ఓటమి

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. స్పల్ప లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. కివీ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు.

2024-11-03 13:07:39

టీమిండియా ఏడో వికెట్‌ డౌన్‌.. పంత్‌ ఔట్‌

రిషబ్‌ పంత్‌ రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. 64 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌.. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రిషబ్ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కష్టాల్లో ఉన్న భారత్‌ను తన విరోచిత పోరాటంతో పంత్‌ ఆదుకున్నాడు. 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా 29 పరుగులు కావాలి.

2024-11-03 12:50:53

మూడో రోజు లంచ్‌ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు అందరూ విఫలమైనప్పటికి స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. 53 పరుగులతో పంత్‌ క్రీజులో ఉన్నాడు. భారత్‌ విజయానికి ఇంకా 55 పరుగులు కావాలి.

2024-11-03 11:34:46

IND vs NZ 3rd Test: ఆరో వికెట్‌ డౌన్‌.. జడేజా ఔట్‌

టీమిండియా జడేజా రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన జడేజా.. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విల్‌ యంగ్‌ అద్భుతమైన క్యాచ్‌తో జడేజాను పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 72/6. టీమిండియా విజయానికి ఇంకా 75 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం పంత్‌(39), సుందర్‌ ఉన్నారు.

2024-11-03 11:17:08

నిలకడగా ఆడుతున్న పంత్‌, జడేజా

భారత ఇన్నింగ్స్‌ను రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రిషబ్‌ పంత్‌(25) దూకుడుగా ఆడుతుండగా, జడేజా(6) కాస్త ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి ఇంకా 88 పరుగులు కావాలి.

2024-11-03 11:01:17

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్‌గా సర్ఫరాజ్‌ ఖాన్‌ వెనుదిరిగాడు. 8 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 31/5. భారత్‌ విజయానికి ఇంకా 116 పరుగులు కావాలి.

2024-11-03 10:33:31

నాల్గో వికెట్‌గా జైశ్వాల్‌

నాల్లో వికెట్‌గా జైశ్వాల్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. జైశ్వాల్‌(5) ను గ్లెన్‌ ఫిలిప్స్‌ పెవిలియన్‌కు పంపాడు. ఫిలిప్స్‌ బౌలింగ్‌లో జైశ్వాల్‌ వికెట్లు ముందు దొరికిపోయాడు.  దాంతో భారత్‌ 28 పరుగులకే నాలుగు వికె ట్లు కో ల్పోయి  కష్టాల్లో పడింది.

2024-11-03 10:28:02

మూడో వికెట్‌గా కోహ్లి ఔట్‌

స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా వరుసగా  వికె ట్లు కోల్పోతుంది. రెండో వికెట్‌గా గిల్‌(1) ఔట్‌ అయిన కాసేపటికే కోహ్లి(1) కూడా పెవిలినయన్‌ చేరాడు. వీరి  ద్దరూ స్పిన్న ర్‌ అజాజ్‌  పటేల్‌ బౌలింగ్‌ లో పెవిలియన్‌ కు చేరారు.  దాంతో భారత్‌ 18 పరుగులకే మూడు  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

2024-11-03 10:23:00

టీమిండియా తొలి వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ ఔట్‌

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ మాట్‌ హెన్రీ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్‌ గిల్‌ వచ్చాడు. 3 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 13/1

2024-11-03 10:02:52

న్యూజిలాండ్‌ ఆలౌట్‌.. భారత్‌ టార్గెట్‌ 147 పరుగులు

ముంబై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 174 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి వికెట్‌గా అజాజ్‌ పటేల్‌ వెనుదిరిగాడు. టీమిండియాకు 147 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ నిర్దేశించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా, అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్‌(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

2024-11-03 09:03:21

ప్రారంభమైన మూడో రోజు ఆట

వాంఖ‌డే వేదిక‌గా భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మూడో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభ‌మైంది. కివీస్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 9 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. క్రీజులో అజాజ్ ప‌టేల్‌(7), ఓ రూర్కే ఉన్నారు. న్యూజిలాండ్ ప్ర‌స్తుతం 143 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. భార‌త్ మ‌రో వికెట్ ప‌డ‌గొడితే కివీస్ ఇన్నింగ్స్ ముగుస్తుంది. టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను జ‌డేజా ఆరంభించాడు.

2024-11-03 09:01:59
Advertisement
 
Advertisement
 
Advertisement