photo credit: IPL Twitter
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆచితూచి ఆడుతుంది. 11 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (31) ఔట్ కాగా.. డుప్లెసిస్ (32), అనుజ్ రావత్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
బిష్ణోయ్ ఉచ్చులో చిక్కన కోహ్లి..
ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఆఖరి బంతికి రవి బిష్ణోయ్ పన్నిన ఉచ్చులో విరాట్ కోహ్లి (31) చిక్కాడు. కింగ్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వస్తున్నాడని ముందే పసిగట్టిన బిష్ణోయ్ తెలివిగా గూగ్లీని సంధించాడు. కోహ్లి బంతిని కనెక్ట్ చేసుకోలేకపోవడంతో వికెట్ కీపర్ పూరన్ అలర్ట్‌గా ఉండి స్టంపింగ్ చేశాడు. దీంతో కోహ్లి పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.
Virat Kohli departs after scoring 31 runs off 30 balls.
— CricTracker (@Cricketracker) May 1, 2023
Another spinner bags Virat Kohli's wicket!
📸: Jio Cinema pic.twitter.com/F2cUEUw55e
మరోమారు స్పిన్నర్‌కే చిక్కిన కోహ్లి..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 సార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబైపై అజేయంగా నిలిచిన కోహ్లి.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్‌లో, లక్నోతో తొలి మ్యాచ్‌లో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో, ఢిల్లీతో మ్యాచ్‌లో లలిత్ యాదవ్ బౌలింగ్‌లో, పంజాబ్‌తో మ్యాచ్‌లో హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో, ఇవాల్టి మ్యాచ్‌లో బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే (ఆకాశ్ సింగ్), రాజస్థాన్ (ట్రెంట్ బౌల్ట్), కేకేఆర్ (రెండో మ్యాచ్‌లో రసెల్)తో మ్యాచ్‌ల్లో పేసర్లకు చిక్కాడు.
2015 తర్వాత అత్యల్ప స్ట్రయిక్‌రేట్..
ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 31 పరుగులు (103.33) చేసి ఔటైన కోహ్లి.. ఐపీఎల్‌లో 2015 సీజన్ తర్వాత అత్యల్ప స్ట్రయిక్ రేట్ (కనీసం 30 బంతులు ఎదుర్కొన్న తర్వాత) నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment