Photo Credit: Twitter
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్కరమ్ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న మార్కరమ్ తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఏడాది తర్వాత ఎంతో ఆశతో బరిలోకి దిగిన మార్కరమ్‌కు ఆస్ట్రేలియా పీడకలను మిగిల్చింది.
విషయంలోకి వెళితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను మార్కరమ్, డికాక్ ఆరంభించారు. హాజిల్‌వుడ్ ఇన్నింగ్స్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ వేశాడు. మార్కరమ్ దానిని టచ్ చేసే క్రమంలో కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కూపర్ కన్నోలి సూపర్ వన్ హ్యాండ్ క్యాచ్ తీసుకోవడంతో మార్కరమ్ గోల్డెన్ డక్ అయ్యాడు.

ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో తొలి బంతికే వెనుదిరిగిన నాలుగో బ్యాటర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో హర్షలే గిబ్స్ రెండుసార్లు, హషీమ్ ఆమ్లా రెండు సార్లు, జానేమన్ మలన్ ఒకసారి ఈ చెత్త రికార్డును నమోదు చేశారు. తాజాగా వీరి సరసన మార్కరమ్ చేరాడు. గిబ్స్ 2002లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో జేమ్స్ ఫ్రాంక్లిన్ బౌలింగ్‌లో ఒకసారి.. అదే ఏడాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అక్రమ్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఇక హషీమ్ ఆమ్లా 2011లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బొలింగర్ బౌలింగ్‌లో; 2013లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జానేమన్ మలన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ విషయానికొస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా 28 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (45), బవుమా (74) క్రీజులో ఉన్నారు. తొలి వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
WHAT A CATCH BY COOPER CONNOLLY 🤯🔥 pic.twitter.com/cfK8zlWyio
— Johns. (@CricCrazyJohns) September 27, 2026
ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బయటకు!


