బంగ్లా బౌల‌ర్ అద్భుత బంతి.. బిత్త‌రపోయిన ఆసీస్ స్టార్‌ | Mehidy Hasan Magical Delivery Stuns Webster As Bangladesh Script Historic Win Over Australia, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

బంగ్లా బౌల‌ర్ అద్భుత బంతి.. బిత్త‌రపోయిన ఆసీస్ స్టార్‌

Aug 16 2026 12:52 PM | Updated on Aug 16 2026 1:57 PM

Mehidy Hasan Miraz Unbelievable Delivery Stuns Australia Star-1st Test

Photo Credit: Twitter

డార్విన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బ్యాటింగ్‌లో తంజిద్, న‌జ్ముల్‌తో పాటు మెహ‌దీ హ‌స‌న్ కూడా రాణించాడు. బ్యాట్‌తో మెరిసిన మెహ‌దీ హ‌స‌న్ ఈసారి బంతితో కూడా మ్యాజిక్ చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మెహ‌దీ హ‌స‌న్ విజ‌యంలో త‌న వంతు పాత్ర‌ను స‌మ‌ర్ధంగా పోషించాడు.

ఈ నేప‌థ్యంలోనే ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మెహ‌దీ హ‌స‌న్ వేసిన ఒక అద్భుత బంతికి వెబ్‌స్ట‌ర్ బిత్త‌ర‌పోవాల్సి వ‌చ్చింది. విష‌యంలోకి వెళితే.. వెబ్‌స్టర్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, మెహిదీ హసన్ మీరాజ్ తన ఆఫ్ స్పిన్‌తో ఆఫ్ స్టంప్ వద్దకు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతిని విసిరాడు, బంతి పిచ్ అయి వెంటనే నిటారుగా వికెట్ల వైపు దూసుకొచ్చింది.

బ్యూ వెబ్‌స్టర్ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో లైన్ అండ్ లెంగ్త్ ను తప్పుగా అంచనా వేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్‌ను తాక‌డంతో వెబ్‌స్ట‌ర్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ఇక త‌న అద్భుత బంతితో వికెట్ ప‌డ‌గొట్టిన సంతోషంలో మెహదీ హ‌స‌న్ సంబ‌రాలు షురూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మూడో బౌల‌ర్‌గా రికార్డు
ఇక మ్యాచ్‌లో మెహ‌దీ హ‌స‌న్ మ‌రో రికార్డు కూడా నెల‌కొల్పాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసిన మూడో బంగ్లా బౌల‌ర్‌గా మెహ‌దీ హ‌స‌న్ నిలిచాడు. 66 ప‌రుగులిచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. హ‌స‌న్ మ‌హ్ముద్ (6/55), మొహ‌మ్మ‌ద్ ర‌ఫీఖ్ (5/62) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

Read: లైవ్‌ మ్యాచ్‌లో వాంతి చేసుకున్న జ‌కోవిచ్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement