మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం | Lionel Messi Goal Argentina Beat Iceland FIFA World Cup 2026 Warm Up, Leads Argentina To Dominant 3-0 Win | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం

Jun 10 2026 10:54 AM | Updated on Jun 10 2026 12:17 PM

Messi Goal-Argentina Beat Iceland-FIFA World Cup 2026 Warm-Up

ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టింది. అలబామా వేదికగా ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ వార్మమ్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. 

మే 24న ఇంటర్ మియామి తరఫున ఆడుతూ కండరాల గాయానికి గురైన మెస్సీ పూర్తిగా కోలుకున్నాడు. ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌లో పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో కనిపించిన మెస్సీ కేవలం 20 నిమిషాల పాటే గ్రౌండ్‌లో ఉన్నాడు. కానీ తాను ఆడిన 20 నిమిషాల్లోనే రెండు కీలక పాస్‌లు సహా ఒక గోల్ చేయడం విశేషం. 

ఆట విషయానికొస్తే తొలి హాఫ్ ముగుస్తుందనగా మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ అందించిన కీలక పాస్‌తో లారో మార్టినేజ్ గోల్‌పోస్ట్‌లోకి బంతిని తరలించాడు. దీంతో తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో 10 నిమిషాల్లో రెండో హాఫ్ ముగుస్తుందనగా మళ్లీ మైదానంలోకి వచ్చిన మెస్సీ ఈసారి తానే స్వయంగా గోల్ చేశాడు. మార్టినేజ్ అందించిన పాస్‌ను ఎలాంటి తప్పు చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి మెస్సీ తన కెరీర్‌లో 117వ గోల్ సాధించాడు. 

దీంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా మూడో గోల్ కొట్టడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. మె‍స్సీ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రోడ్రిగో డి పాల్ దానిని థియాగో అల్మాడాకు పాస్ చేయగా, అతడు బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. దీంతో అర్జెంటీనా 3-0తో ఐస్‌లాండ్‌పై విజయం సాధించింది. 

ఈ విజయంతో వార్మప్ మ్యాచ్‌లను ముగించిన  మెస్సీ సేన ఫిఫా ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది. గ్రూప్‌-జెలో ఉన్న అర్జెంటీనా ఆ తర్వాత ఆస్ట్రియా, జోర్డాన్‌లను ఎదుర్కోనుంది.

చదవండి: గెలిచామ‌న్న గ‌ర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement