ఐపీఎల్-2023లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. బుధవారం చెన్నై వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 26న జరగనున్న క్వాలిఫియర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.. స్పిన్నర్ కుమార్ కార్తీకేయ స్థానంలో మరో యువ స్పిన్నర్ హృతిక్ షోకీన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ముంబై ఇండియన్స్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా ముంబై విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ముందు కృనాల్ పాండ్యా వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాలి. అయితే ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం కాస్త వీక్‌గా ఉండడం లక్నోకు కలిసొచ్చే ఆంశం అనే చెప్పుకోవాలి.
మరోవైపు లక్నో కూడా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో లక్నోకు ఓపెనింగ్ ప్రధాన సమస్యగా ఉంది. కాబట్టి ఈ కీలకమైన మ్యాచ్‌కు విధ్వంసకర ఓపెనర్ కైల్ మైర్స్‌ను తిరిగి తీసుకు రావాలని లక్నో మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మైర్స్ జట్టులోకి వస్తే.. పేసర్ నవీన్ ఉల్ హక్ బెంచ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. అదే విధంగా కరణ్ శర్మ స్థానంలో పేసర్ యష్‌ఠాకూర్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తుది జట్లు(అంచనా)
లక్నో: క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్, హృతిక్ షోకీన్
చదవండి: IPL 2023 Finals: ఫైనల్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్ షాక్.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది?
#MS Dhoni: మా వాళ్లకు చుక్కలు చూపిస్తా! పాపం వాళ్ల పరిస్థితి ఊహించుకోండి! నా రియాక్షన్స్ కోసం కాకపోయినా..
Comments
Please login to add a commentAdd a comment