వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది! | Minerva Football Club Stunning Performance Ends In Quarter Finals In MIC Tourney | Sakshi
Sakshi News home page

వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 10:21 AM

Minerva Football Club Stunning Performance Ends In Quarter Finals In MIC Tourney

భార‌త్‌కు చెందిన మిన‌ర్వా ఫుట్‌బాల్  క్ల‌బ్  సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారింది. అండ‌ర్‌-15 మెడిటేరియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌ప్ (ఎంఐసీ) టోర్నీలో తొలిసారి ఆడుతున్నప్ప‌టికీ మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. క్వార్ట‌ర్స్‌లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ త‌మ ఆట‌తో ఫుట్‌బాల్ అభిమానుల మ‌న‌సుల‌ను దోచేసింది. 

గ్రూప్ ద‌శ‌లో మిన‌ర్వా క్ల‌బ్ తొలి మ్యాచ్‌లో 3-0తో కెనెడా బ్రేవ్స్‌ను, ఆ త‌ర్వాత బొకా ఎఫ్‌సీపై 4-1తో, ఈఎఫ్ సాంటాపై 1-0తో విజ‌యాలు సాధించి టేబుల్ టాప‌ర్‌గా నిలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్ట‌ర్స్‌లో బ‌ల‌మైన లివ‌ర్‌పూల్ ఎఫ్‌సీ జూనియ‌ర్స్ జ‌ట్టును 0-6తో ఓడించి మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొని క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. 

అయితే క్వార్ట‌ర్స్‌లో స్పానిష్ క్ల‌బ్ యూఈ ఫిగ‌ర్స్ చేతిలో 2-1 తేడాతో ఓడిన మిన‌ర్వా క్ల‌బ్ ఇంటిబాట ప‌ట్టింది. అయితే ప్రిక్వార్ట‌ర్స్‌లో లివ‌ర్‌పూల్‌ను 6-0తో చిత్తు చేయ‌డం ద్వారా మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ అరుదైన ఘ‌న‌త సాధించింది. మెడిటేరియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌ప్‌లో ఇంగ్లీష్ జెయింట్స్‌ను చిత్తు చేసిన తొలి భార‌త ఫుట్‌బాల్ క్ల‌బ్‌గా మిన‌ర్వా జ‌ట్టు చ‌రిత్ర‌కెక్కింది. 

లివ‌ర్‌పూల్‌తో మ్యాచ్‌లో మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ త‌ర‌ఫున మొహమ్మ‌ద్ ఆజ‌మ్ ఖాన్ (ఆట రెండో నిమిషం, 36 వ నిమిషం), అమ‌ర్స‌న్ సింగ్ (11వ నిమిషం), సింగ్ (25, 28వ, 47వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఈ నేప‌థ్యంలో మిన‌ర్వా ఫుట్‌బాల్ క్లబ్ ప్ర‌ద‌ర్శ‌న‌పై కేంద్ర క్రీడాశాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ ‘ఎక్స్‌’ వేదిక‌గా స్పందించారు.

‘భార‌త ఫుట్‌బాల్‌లో ఇది కొత్త ఆరంభం. అంత‌ర్జాతీయంగా భార‌త ఫుట్‌బాల్ మరింత దేదీప్య‌మానంగా వెలుగొందాల‌ని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.ఇక గ‌తేడాది మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ మూడో ట్రోఫీల‌ను సొంతం చేసుకుంది. స్వీడ‌న్‌లో జ‌రిగిన గోతియా క‌ప్‌, డెన్మార్క్‌లో జ‌రిగిన డానా క‌ప్‌, నార్వేలో జ‌రిగిన నార్వే క‌ప్‌ల‌ను గెలుచుకుంది.

చదవండి: ‘త్యాగాలు చేశా.. ఐపీఎల్‌ వల్ల కెరీర్ నాశ‌న‌మైంది’

Advertisement
 
Advertisement
Advertisement