అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ 2026) టోర్నీలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఆదివారం ముంబై న్యూయార్క్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ 68 బంతుల్లోనే 155 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 13 సిక్సర్లు ఉండడం విశేషం.
మిచెల్ ఓవెన్ దెబ్బకు ముంబై న్యూయార్క్ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ ఓవెన్ విధ్వంసకర సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27), మార్క్ చాప్‌మన్ (23) పర్వాలేదనిపించారు. ముంబై న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, కార్బిన్ బోష్, షెపర్డ్, ఉగర్కర్, కోరె అండర్సన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 246 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ 5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ముంబై న్యూయార్క్ విజయానికి 89 బంతుల్లో 201 పరుగులు అవసరం. క్రీజులో పొలార్డ్ (10), అండర్సన్ ఉన్నారు.
కాగా ఆస్ట్రేలియా తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోరు బాదిన రెండో క్రికెటర్‌గా మిచెల్ ఓవెన్ నిలిచాడు. ఓవెన్ కంటే ముందు ఆరోన్ ఫించ్ (2013లో 156 పరుగులు, 2018లో 175 పరుగులు) రెండు అత్యధిక స్కోర్లతో ముందున్నాడు. 24 ఏళ్ల ఓవెన్ ఆస్ట్రేలియా తరఫున 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Mitchell Owen casually giving everyone some neck exercises ✨#MLC2026 #FreedomExpress #WFvMINY pic.twitter.com/ai99q1CKPL
— Washington Freedom (@WSHFreedom) June 21, 2026


