మెల్‌బోర్న్ : మొహమ్మద్ సిరాజ్ తొలి రోజు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి సెషన్‌లో ఒక్క ఓవర్ కూడా వేయని అతను లంచ్ నుంచి రాగానే బంతిని అందుకున్నాడు. ఆరంభంలో లయ అందుకోవడానికి కొంత సమయం తీసుకున్న సిరాజ్ తన మొదటి స్పెల్‌ను 6–0–24–0తో ముగించాడు. అయితే కెప్టెన్ రహానే నమ్మకాన్ని నిలబెడుతూ టీ విరామానికి ముందు లబుషేన్‌ను, బ్రేక్ తర్వాత గ్రీన్‌ను అతను అవుట్ చేశాడు. సహచర అరంగేట్ర ఆటగాడు గిల్ పట్టిన క్యాచ్‌తో తొలి వికెట్ దక్కగా... పదునైన ఇన్‌స్వింగర్‌కు గ్రీన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. (చదవండి : రెండో టెస్టు: హో విల్సన్, ఇది చీటింగ్!)
సిరాజ్ రెండో స్పెల్ 9–4–16–2 కావడం విశేషం. అతను రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఆసీస్ చివరి వికెట్ అయిన కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్ బౌండరీ వద్ద అందుకున్న సిరాజ్... ఇన్నింగ్స్ ముగియడంతో తన తొలి టెస్టు జ్ఞాపికగా బంతిని అప్పుడే తన వద్ద ఉంచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ దీనిని వారిస్తూ బంతిని వెనక్కి తీసుకున్నాడు. బహుశా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇవ్వవచ్చేమో! (చదవండి : క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు)
Comments
Please login to add a commentAdd a comment