
సాక్షి, చెన్నై: 2022 వరకు చెన్నై సూపర్‌కింగ్స్‌లో ధోని క్రికెట్ ఆడతారని ఆ జట్టు కార్యనిర్వాహక అధికారి కె. విశ్వనాథన్ పేర్కొన్నారు. క్రీడాకారుల ప్రాక్టీసుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. చెన్నైకు వచ్చే క్రీడాకారులకు కరోనా పరీక్షలకు తగ్గ నిర్ణయం తీసుకున్నారు. యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతులు రావడంతో చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది. ఈనెల 16న జట్టు సభ్యులు చెన్నైకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 20వ తేదీ వరకు ప్రాక్టీసు చేయనున్నారు. 21 లేదా 22న ఎమిరేట్స్‌కు జట్టు పయనం కానుంది. జట్టుకు ప్రధాన ఆకర్షణ సారధి ధోని. చెన్నై సూపర్ కింగ్స్‌జట్టు కార్యనిర్వాహక అధికారి విశ్వనాథన్ పేర్కొంటూ సూపర్ కింగ్స్‌లో మరో రెండేళ్లు ధోని ఉండే అవకాశాలు ఎక్కువేనని వ్యాఖ్యానించారు.