
ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. ఫైనల్లో శ్రావ్య (తెలంగాణ)–షర్మద (కర్ణాటక) ద్వయం 6–2, 6–3తో వైదేహి (గుజరాత్)–మిహికా యాదవ్ (మహారాష్ట్ర)పై జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్)–ప్రజ్వల్ (కర్ణాటక) జంట 6–2, 7–6 (7/3)తో చంద్రిల్æ–లక్షిత్ (పంజాబ్) జంటపై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment