Ned Vs WI ODI Series- Who Is Teja Nidamanuru: ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓటమి పాలైంది. వరణుడి అడ్డంకి కారణంగా డీఎల్‌ఎస్ పద్ధతిలో నిర్వహించిన 45 ఓవర్ల మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
అయితే, పర్యాటక జట్టు చేతిలో ఆతిథ్య జట్టు భంగపడ్డా నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ తేజ నిడమనూరు మాత్రం అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. పేరులో తెలుగుదనం ఉట్టిపడుతున్న ఈ క్రికెటర్ నిజంగా తెలుగు కుర్రాడే.
తేజ నిడమనూరు(PC: Teja Nidamanuru)
ఇంతకీ ఎవరీ తేజ!
తేజ పూర్తి పేరు అనిల్ తేజ నిడమనూరు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 1994లో ఆగష్టు 22న జన్మించాడు. క్రికెట్‌పై మక్కువ ఉన్న అతడు ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.
ఇక ఆరంభంలో న్యూజిలాండ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన తేజ.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌కు వెళ్లాడు. అక్కడ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఏకంగా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.
ఈ క్రమంలో వెస్టిండీస్‌తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 27 ఏళ్ల తేజ మొదటి మ్యాచ్‌లోనే తన సత్తా చాటాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి న్యూజిలాండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో తేజ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘ఆరెంజ్, బ్లూ జెర్సీ వేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కేవలం థాంక్స్ అన్న ఒక్క మాట సరిపోదు. నా దృష్టిలో మీ స్థానం ఏమిటో మీకు తెలుసు కదా!’’ అంటూ తనకు అండగా నిలిచిన వారి పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.
మ్యాచ్ స్కోర్లు:
నెదర్లాండ్స్: 240/7 (45)
వెస్టిండీస్: 249/3 (43.1)
🎯 DLS Target 247 for the West Indies to win. https://t.co/9gJVlLVl0f
— Cricket🏏Netherlands (@KNCBcricket) May 31, 2022
Comments
Please login to add a commentAdd a comment