Check How Netherlands Directly Qualified for 2024 T20 World Cup?
Sakshi News home page

T20 WC 2022: నెదర్లాండ్స్‌ సంచలనం.. బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి మేటి జట్లతో పాటు నేరుగా

Published Mon, Nov 7 2022 8:34 AM | Last Updated on Mon, Nov 7 2022 10:53 AM

Netherlands Qualified For T20 WC 2024 Check How Remain Teams - Sakshi

T20 World Cup 2024: దక్షిణాఫ్రికాపై సంచలన విజయంతో నెదర్లాండ్స్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ-2024 ఆడటానికి మార్గం సుగమం చేసుకుంది. 2024లో వెస్టిండీస్‌–అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించింది. కాగా తాజా ప్రపంచకప్‌లో టాప్‌–8లో నిలిచిన జట్లకు తదుపరి మెగా టోర్నీకి నేరుగా అర్హత కల్పించారు.

టీ20 ప్రపంచకప్‌-2022లో గ్రూప్‌-1 నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో పాటు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, శ్రీలంక ఈ జాబితాలో ఉన్నాయి. ఇక గ్రూప్‌-2 నుంచి సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌, పాకిస్తాన్‌తో పాటు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా, నాలుగో ప్లేస్‌లో ఉన్న నెదర్లాండ్స్ కూడా చోటు దక్కించుకున్నాయి.

బంగ్లాదేశ్‌ను వెనక్కినెట్టి
కాగా తాజా ఎడిషన్‌ సూపర్‌-12లో ఆఖరి రోజైన ఆదివారం (నవంబరు 6) డచ్‌ జట్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మేటి జట్టుగా పేరున్న సౌతాఫ్రికాను ఓడించి.. ప్రొటిస్‌ సెమీస్‌ ఆశలపై నీళ్లు చల్లింది. క్వాలిఫైయర్స్‌లో నమీబియాపై యూఏఈ విజయంతో సూపర్‌-12 వరకు వచ్చిన డచ్‌ జట్టు.. ఈ దశలో ఆడిన 5 మ్యాచ్‌లలో రెండు గెలిచింది.

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌(-1.176) కంటే మెరుగైన రన్‌రేటు(-0.849)కలిగి ఉండి షకీబ్‌ బృందాన్ని వెనక్కి నెట్టి గ్రూప్‌-2లో టాప్‌-4లో నిలిచింది. తద్వారా ఓవరాల్‌గా టాప్‌-8లో నిలిచి వచ్చే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించింది. ఇక ఈ 8 జట్లతో పాటు ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా కూడా అర్హత పొందాయి.

అదే విధంగా ఐసీసీ ర్యాంకింగ్‌ ఆధారంగా మరో రెండు జట్లకు బెర్త్‌లు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తొమ్మిది, పది ర్యాంకుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకున్నాయి. కాగా 2024 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొననున్న నేపథ్యంలో మిగతా ఎనిమిది బెర్త్‌లు రీజినల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా ఖరారవుతాయి.  

చదవండి: సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement