టీమిండియా ఆల్‌రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ టూర్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న నితీశ్ రెడ్డి రెండు సిరీస్‌ల నుంచి వైదొలినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రక టన విడుదల చేయాల్సి ఉంది.
నితీశ్‌రెడ్డిని బెంగళూరులోని బీసీసీఐ రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించే అవకాశముంది. కాగా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక గాయపడిన నితీశ్‌కుమార్ రెడ్డి స్థానంలో ముంబై ఆల్‌రౌండర్ సుయాన్ష్ హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం.
శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్‌లో సూర్యాన్ష్ మంచి ప్రదర్శన కనబరిచి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సిరీస్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యాన్ష్ 149 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ సమయంలోనే తొడ కండరాల నొప్పితో రెండో వన్డేకు నితీశ్ రెడ్డి దూరమయ్యాడు.
అయితే చివరి వన్డేలో ఆడిన నితీశ్ రెడ్డి మరోమారు తొడ కండరాల గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నితీశ్‌రెడ్డి నాలుగు వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆఫ్గన్‌తో ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నప్పటికీ కేవలం ఒక టెస్టుతో పాటు వన్డే మాత్రమే ఆడాడు. ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా మంగళవారం రాత్రి బెల్‌ఫాస్ట్‌కు బయల్దేరనుంది.
Some #TeamIndia News: Nitish Reddy's left quadriceps injury has aggravated. He is out of UK Tour. Rehab will take some time @BCCI #Cricket
— Kushan Sarkar (@kushansarkar) June 23, 2026


