ఆసియాకప్-2023లో దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం కాండీ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు ఈ ఆసియాకప్ టోర్నీలో భారత్‌దే పై చేయి. మరోసారి చిరకాల ప్రత్యర్థిపై అధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు భారత జట్టు అన్ని విధాల సిద్దమైంది.
తిలక్ వర్మకు చోటు..
అదే విధంగా పాక్‌తో పోరుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా జట్టు మెనెజ్‌మెంట్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాదీ తిలక్ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో తిలక్‌కు చోటిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20ల్లో నెం1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తెలిపోతున్నాడు.
ఈ క్రమంలో అతడిని బెంచ్‌కే పరిమితం చేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఇక విండీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వర్మ.. అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. అదే విధంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ప్లేస్ దాదాపు ఖాయమైంది. రోహిత్ జోడిగా కిషన్‌ను పంపి, గిల్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపే సూచనలు కన్పిస్తున్నాయి.
నాలుగో స్ధానంలో ఎవరు?
ఇక శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వడంతో మిడిలార్డర్ కష్టాలు తీరనున్నాయి. అయ్యర్ నాలుగో స్ధానంలో కాకుండా ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భారత ఇన్నింగ్స్‌ను రోహిత్, కిషన్ ప్రారంభించే అవకాశం ఉంది.
కాబట్టి శుబ్‌మన్ గిల్ మూడో స్ధానంలో, కోహ్లి నాలుగో స్ధానంలో బ్యాటింగ్ రావల్సి ఉంటుంది. కాబట్టి అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారనుంది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా
పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! భారత్‌కు కూడా సాధ్యం కాలేదు
Comments
Please login to add a commentAdd a comment