అబుదాబి: ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్ వికెట్‌లను చేజార్చుకుంది. తొలుత సీఎస్‌కే టాస్ గెలవడం ద్వారా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు మంచి ఆరంభం లభించింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే రోహిత్ ఫోర్ కొట్టాడు. ఆపై డీకాక్‌కు కూడా బ్యాట్ ఝుళింపించాడు. వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్‌రేట్‌ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. సీఎస్‌కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన ఐదో ఓవర్ నాల్గో బంతికి రోహిత్(12) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, క్వింటాన్ డీకాక్(33) ఆ తర్వాత ఓవర్‌లో పెవిలియన్ చేరాడు.(చదవండి: ఐపీఎల్ 2020: తొలి మ్యాచ్‌లో టాస్ ధోనిదే)
పేసర్ సామ్ కరాన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డీకాక్(33) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. డీకాక్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు. కరాన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డీకాక్.. వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో ముంబై 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్.. రన్నరప్ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం. చెన్నైతో ముఖాముఖి రికార్డులో రోహిత్ శర్మ బృందం 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ధోని దళం 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment