రోహిత్ శర్మ(ఫైల్‌ఫోటో)
అబుదాబి: ఈసారి ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను ఒక పేలవమైన రికార్డు భయపెడుతోంది. ఐదేళ్ల క్రితం యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కానీ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టలేదు. ఇది ముంబైను సెంటిమెంట్ పరంగా కలవర పెట్టడం ఖాయం. ఈరోజు(శనివారం) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా పోరుకు సిద్ధమైంది. ఒకవైపు సీఎస్‌కే బలహీనంగా ఉండగా, ముంబై మాత్రం అన్ని విభాగాల్లోనూ పట్టిష్టంగా ఉంది. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌ల గైర్హాజరీ సీఎస్‌కేను కాస్త కలవర పెడుతోంది. మరి సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ధోని ఉండటమే జట్టుకు కొండంత బలం. ఒకవేళ పటిష్టంగా ఉన్న ముంబై.. సీఎస్‌కే చేతిలో ఓడిపోతే మాత్రం మళ్లీ ఒత్తిడిలో పడుతుంది.(చదవండి: ఫీల్డింగ్‌లో మెరుపులు.. జరజాగ్రత్త!)
2014లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడింది. ఇది లీగ్ ఆరంభం మ్యాచ్. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆపై ఆర్సీబీ చేతిలో 7 వికెట్ల తేడాతో, సీఎస్‌కే చేతిలో 7వికెట్ల తేడాతో పరాజయం చెందింది. అటు తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబైను ఓడించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించాయి. దాంతో ముంబై వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓటమి చెందింది ఓ చెత్త రికార్డను మూటగట్టుకుంది. కాగా, వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడినా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరడం విశేషం. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఓడి ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2014 ఫైనల్ కేకేఆర్-కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఆ తుది పోరులో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది.(చదవండి: ఐపీఎల్ 2020: ‘త్రీ’ వర్సెస్ ‘ఫోర్’)
Comments
Please login to add a commentAdd a comment