మాజీ క్రికెట‌ర్ షోయబ్‌ అక్త‌ర్ ఇంట్లో విషాదం | Former Pakistan Cricketer Shoaib Akhtar Brother Shahid Akhtar Passes Away, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెట‌ర్ షోయబ్‌ అక్త‌ర్ ఇంట్లో విషాదం

Jun 24 2026 10:28 AM | Updated on Jun 24 2026 11:54 AM

Pak Cricketer-Shoaib-Akhtar-Emotionally Announce-His-Brother Demise

పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఇంట్లో విషాదం నెల‌కొంది. మంగ‌ళ‌వారం రాత్రి షోయ‌బ్‌ అక్త‌ర్ సోద‌రుడు షాహిద్ అక్త‌ర్ క‌న్నుమూశాడు. త‌న అన్న మ‌ర‌ణ వార్త‌ను అక్త‌ర్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 'నా అన్న అల్లా ద‌గ్గ‌రికి వెళ్లిపోయాడు' అని ఎమోష‌న‌ల్‌ కామెంట్‌ను జత చేశాడు. 

అయితే షాహిద్‌ ఎప్పుడు చ‌నిపోయార‌న్నది కచ్చితంగా తెలియ‌న‌ప్ప‌టికీ అక్త‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టిన స‌మ‌యం ఆధారంగా మంగ‌ళ‌వారం రాత్రే అతడు క‌న్నుమూసిన‌ట్లు తెలుస్తోంది. 2021లో షోయ‌బ్ అక్త‌ర్ త‌న అమ్మ‌ను కోల్పోయాడు. ఆ స‌మ‌యంలో అక్త‌ర్‌కు సోద‌రుడు షాహిద్ అండ‌గా ఉన్నాడు. ఇప్పుడు అన్న కూడా మ‌ర‌ణించ‌డం షోయ‌బ్ అక్త‌ర్‌కు పూడ్చ‌లేని లోటు అని చెప్పొచ్చు. 

షోయ‌బ్ అక్త‌ర్ క్రికెట‌ర్‌గా మార‌డానికి అన్న షాహిద్ అక్త‌ర్ ప్రోత్సాహం మ‌రువ‌లేనిది. అక్త‌ర్ టీనేజీ వ‌య‌సు దాకా క్రికెట్‌లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. అయితే ఒక‌సారి స్థానిక క్రికెట్ జ‌ట్టులో ప్లేయ‌ర్ అవ‌స‌రం పడడంతో షోయబ్ అక్తర్‌ను ఆ మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశమివ్వాలని సదరు జట్టును కోరాడు.

అలా స్థానిక క్రికెట్‌లో రాణించిన షోయబ్ ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. అనంతరం అతడికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆరోజు అన్న షాహిద్ అండగా నిలబడకపోయుంటే ఇవాళ షోయబ్ అక్తర్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదేమో. ఆరోజు ఆ మ్యాచ్ అవకాశం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని అక్తర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 

ఇక అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఫాస్ట్ బౌల‌ర్ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందిన షోయ‌బ్ అక్త‌ర్ పాకిస్తాన్ త‌ర‌ఫున 1997లో అరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల కెరీర్‌లో అక్త‌ర్ 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వ‌న్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత క్రికెట్ అన‌లిస్ట్‌గా, మెంటార్‌గా యాక్టివ్ మోడ్‌లో ఉన్నాడు. అంతేకాదు అక్త‌ర్ యూట్యూబ్ చానెల్‌కు అంత‌ర్జాతీయంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

Read: ‘మెస్సీపై ప్ర‌శ్న‌లెందుకు’.. రొనాల్డో అసహనం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement