
ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా చేలరేగడంతో పాకిస్తాన్ 148 పరుగులకే చాప చుట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీను భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
కారణం ఏంటంటే.. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఆసిఫ్ అలీ విలేకురుల సమావేశంలో మాట్లాడాడు. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతునున్నారు అన్న ప్రశ్నకు.. "ప్రతీ రోజు ప్రాక్టీస్‌లో భాగంగా 100 నుంచి 150 సిక్స్‌లు కొడుతున్నా, మ్యాచ్‌లో మాత్రం కనీసం మూడు నుంచి నాలుగు సిక్స్‌లు అయినా కొడతా" అని అలీ ప్రగల్బాలు పలికాడు.
అయితే భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆసిఫ్ తుస్సు మనిపించాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఎదర్కొన్న అలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. సిక్స్‌లు మాట పక్కన పెడితే కనీసం ఒక ఫోర్ కూడా కొట్టలేక పోయావు అంటూ ఆసిఫ్ అలీని భారత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: Asia cup 2022: 'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా'
Comments
Please login to add a commentAdd a comment