సౌతాంప్టన్: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కూడా వానబారిన పడింది. శుక్రవారం 40.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (116 బంతుల్లో 60 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బాబర్ ఆజమ్ (47) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి సెషన్‌లో 29 పరుగులు చేసిన పాక్ వికెట్ మాత్రం కోల్పోలేదు. అయితే లంచ్ తర్వాత తక్కువ వ్యవధిలో యాసిర్ షా (5), షాహిన్ అఫ్రిది (0), అబ్బాస్ (2) వెనుదిరిగారు. ఈ దశలో మరో ఎండ్‌లో ఉన్న రిజ్వాన్ దూకుడు ప్రదర్శించాడు. చకచకా పరుగులు సాధించిన రిజ్వాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment