
పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లగా మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా పాక్ జట్టులో షాదాబ్ కొనసాగుతూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ వాయిదా పడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా షాదాబ్ ఖాన్ ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అతడు బౌలింగ్ చేయడానికి అత్యంత కష్టమైన బ్యాటర్ల పేర్లను అడిగాడు. దానికి బదులుగా షాదాబ్ .. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అని చెప్పాడు. ఇక షాదాబ్ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోను, అంతకముందు టీ20 ప్రపంచకప్‌లోను అద్బుతంగా రాణించాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు షాదాబ్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నాడు.
చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
Comments
Please login to add a commentAdd a comment