ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన ఆసీస్‌ బౌలర్లు.. 147 ఆలౌట్‌ | Pat Cummins Five Wicket Haul England 142 All Out AUS vs ENG 1st Test | Sakshi
Sakshi News home page

AUS vs ENG 1st Test Ashes Series: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన ఆసీస్‌ బౌలర్లు.. 147 ఆలౌట్‌

Published Wed, Dec 8 2021 10:20 AM | Last Updated on Wed, Dec 8 2021 10:35 AM

Pat Cummins Five Wicket Haul England 142 All Out AUS vs ENG 1st Test - Sakshi

England All Out For 147 Vs Aus 1st Test Ashes Series.. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్లు ఆరంభం నుంచి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడమే గగనమైపోయింది.

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో జాస్‌ బట్లర్‌ 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్‌ 35 పరుగులు చేశాడు. క్రిస్‌ వోక్స్‌ 21, హసీబ్‌ హమీద్‌ 25 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాట్‌ కమిన్స్‌ సూపర్‌స్పెల్‌తో మెరిశాడు. 13 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌ 2, జోష్‌ హాజిల్‌వుడ్‌ 2, కామెరాన్‌ గ్రీన్‌ 1 వికెట్‌ తీశారు. 

చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్‌ స్టార్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement