
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది. లావోస్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాయస్ జైన్–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్ జిన్‌యువాన్–కిన్ యుజువాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్–19 బాలుర డబుల్స్‌లో, అండర్–19 బాలికల సింగిల్స్‌లో, అండర్–19 బాలుర టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment