Cadet Table Tennis
-
భారత జోడీకి స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది. లావోస్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్డ్ డబుల్స్‌లో పాయస్ జైన్–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్ జిన్యువాన్–కిన్ యుజువాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్–19 బాలుర డబుల్స్‌లో, అండర్–19 బాలికల సింగిల్స్‌లో, అండర్–19 బాలుర టీమ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి. -
‘పసిడి’ శ్రీజ
సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణాలు దక్షిణాసియా టీటీ టోర్నీ న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. తొమ్మిది విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటుకుంది. టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన శ్రీజ వ్యక్తిగత విభాగాల్లోనూ తన హవా చలాయించింది. జూనియర్ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో శ్రీజ పసిడి పతకాలను సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 11-9, 8-11, 11-4, 11-9, 11-8తో శ్రుతి అమృతే (భారత్)పై గెలుపొందగా... డబుల్స్ ఫైనల్లో శ్రీజ-శ్రుతి ద్వయం 6-11, 11-3, 11-6, 12-10తో రువిన్ కనన్గోరా-ప్రియదర్శిని (శ్రీలంక) జంటను ఓడించింది. -
సింగిల్స్ రన్నరప్ వరుణి జైస్వాల్
జాతీయ సబ్ జూ॥క్యాడెట్ టీటీ టోర్నీ సాక్షి, రాజమండ్రి: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి వరుణి జైస్వాల్ రజత పతకాన్ని సాధించింది. శనివారం ముగిసిన ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన వరుణి సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరుణి 13-11, 13-11, 7-11, 6-11, 4-11, 8-11తో అర్చన (కర్ణాటక) చేతిలో పోరాడి ఓడింది. సెమీఫైనల్లో వరుణి 11-5, 11-7, 11-5, 11-7తో అనూష (మధ్యప్రదేశ్)పై, క్వార్టర్ ఫైనల్లో 11-5, 11-4, 7-11, 13-11తో ప్రియాంక (రాజస్థాన్)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో మానవ్ (పీఎస్‌పీబీ ‘ఎ’) విజేతగా నిలిచాడు. ఫైనల్లో మానవ్ 11-9, 15-13, 10-12, 11-4, 11-13, 11-9తో పార్థ్ (ఢిల్లీ)పై గెలిచాడు. క్యాడెట్ బాల,బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో జీహో (పీఎస్‌పీబీ ‘ఎ’) 10-12, 11-9, 11-6, 8-11, 11-4, 8-11, 12-10తో అల్బెర్టో (పీఎస్‌పీబీ ‘ఎ’)పై; వన్షిక 11-6, 8-11, 11-8, 11-8, 14-16, 12-10తో దియా (మహారాష్ట్ర ‘ఎ’)పై నెగ్గారు.