‘పసిడి’ శ్రీజ | Cadet Table Tennis Championships Akula srija | Sakshi
Sakshi News home page

‘పసిడి’ శ్రీజ

Published Sat, Jun 20 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

Cadet Table Tennis Championships Akula srija

సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణాలు

  దక్షిణాసియా టీటీ టోర్నీ
 న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. తొమ్మిది విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటుకుంది. టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన శ్రీజ వ్యక్తిగత విభాగాల్లోనూ తన హవా చలాయించింది. జూనియర్ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో శ్రీజ పసిడి పతకాలను సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 11-9, 8-11, 11-4, 11-9, 11-8తో శ్రుతి అమృతే (భారత్)పై గెలుపొందగా... డబుల్స్ ఫైనల్లో శ్రీజ-శ్రుతి ద్వయం 6-11, 11-3, 11-6, 12-10తో రువిన్ కనన్‌గోరా-ప్రియదర్శిని (శ్రీలంక) జంటను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement