స‌న్‌రైజ‌ర్స్ తుది జ‌ట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆట‌గాడికి నో ఛాన్స్‌? | Predicted SRH Playing XI vs KKR: Will Ishan Kishan bring Liam Livingstone in? | Sakshi
Sakshi News home page

KKR vs SRH: స‌న్‌రైజ‌ర్స్ తుది జ‌ట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆట‌గాడికి నో ఛాన్స్‌?

Apr 1 2026 6:55 PM | Updated on Apr 1 2026 7:28 PM

Predicted SRH Playing XI vs KKR: Will Ishan Kishan bring Liam Livingstone in?

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌మ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. గురువారం(ఏప్రిల్ 2) ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓట‌మి పాలైన స‌న్‌రైజ‌ర్స్.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ ప‌రంగా ఎంత ప‌టిష్టంగా ఉందో, బౌలింగ్ ప‌రంగా అంతే బ‌ల‌హీనంగా క‌న్పిస్తోంది. ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్కట్ వంటి ఫాస్ట్ బౌల‌ర్లు ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.

అంతేకాకుండా కొత్త‌గా జ‌ట్టులోకి వ‌చ్చిన సీనియ‌ర్ పేస‌ర్ డేవిడ్ పేయిన్, గ‌త సీజ‌న్‌లో అద‌ర‌గొట్టిన ఎషాన్ మ‌లింగ‌ సైతం విఫ‌ల‌మ‌య్యారు. దీంతో కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో ప‌లు మార్పులు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది.

డేవిడ్ పేయిన్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ బ్రైడ‌న్ కార్స్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. వాస్త‌వానికి తొలి మ్యాచ్‌లోనే కార్స్ ఆడాల్సి ఉండేది. కానీ ప్రాక్టీస్ సెష‌న్‌లో చిన్న‌పాటి గాయం కార‌ణంగా అత‌డు మొద‌టి మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అయితే ఇప్పుడు అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు స‌మాచారం. 

అదేవిధంగా హ‌ర్ష్ దూబే స్ధానంలో జీషాన్ అన్సారీని ఆడించాల‌ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌త మ్యాచ్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు మరోసారి నిరాశే ఎదరయ్యే అవ‌కాశ‌ముంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కడం లేదు. 

ఒక‌వేళ లివింగ్‌స్టోన్ ఆడించాలంటే ఎషాన్ మ‌లింగ లేదా పేయిన్‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తుంది. అలా చేస్తే జట్టులో క్వాలిటీ బౌలర్లు ఎవరూ ఉండరు. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అంత భారీ ధ‌ర చెల్లించిన‌ప్ప‌టికి అత‌డిని ఎస్ఆర్‌హెచ్ ఉప‌యోగించుకోక‌పోవ‌డం ప్ర‌స్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టు(అంచ‌నా)
అభిషేక్ శర్మ,ట్రావిస్ హెడ్,ఇషాన్ కిషన్,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి,సలీల్ అరోరా, బ్రైడ‌న్ కార్స్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, జయదేవ్ ఉనద్కట్‌, జీష‌న్ అన్సారీ
ఇంపాక్ట్‌ ప్లేయర్‌: పేయిన్‌/ ఎషాన్‌ మలింగ
చదవండి: ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడ‌నున్న సామ్ కర్రాన్‌?

Advertisement
 
Advertisement
Advertisement