సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది! | PV Sindhu Advances To Second Round Indonesia Open Super Series | Sakshi
Sakshi News home page

సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది!

Jun 2 2026 5:30 PM | Updated on Jun 2 2026 6:08 PM

PV Sindhu Advances To Second Round Indonesia Open Super Series

ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్‌-1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ మ‌హిళ‌ల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధూ 25-23, 21-16తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్‌ను మ‌ట్టిక‌రిపించిది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో సింధూ త‌న ప్రత్య‌ర్థిపై ఆద్యంతం ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. 

అయితే తొలి గేమ్ హోరాహోరీగా సాగిన‌ప్ప‌టికీ, రెండో గేమ్‌లో మాత్రం సింధూ త‌నలోని ఆట‌ను బ‌య‌టికి తీసి సునాయాస విజ‌యాన్ని అందుకుంది. అయితే రెండో రౌండ్‌లో సింధూ.. ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ యాన్ సే యంగ్‌ను ఎదుర్కోనుంది. గ‌త‌వారం సింగ‌పూర్ ఓపెన్‌లో యాన్ సే చేతిలో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. 

మరి ఈసారైనా ఆమె గండం దాటి ప్రిక్వార్ట‌ర్స్‌కు చేరుకుంటుందేమో చూడాలి. మిగిలిన మ్యాచ్‌ల విష‌యానికొస్తే మాళ‌విక బ‌న్సోద్ తొలి రౌండ్‌కే ప‌రిమిత‌మైంది. మాళ‌విక బ‌న్సోద్ 12-21, 10-21తో ఏడో సీడ్ పోర్న్‌పావీ చోచువాంగ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట ప‌ట్టాడు. 

తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 19-21, 15-21తో జ‌పాన్‌కు చెందిన యుషి త‌నాకా చేతిలో చిత్త‌య్యాడు. డ‌బుల్స్ మ్యాచ్‌ల విష‌యానికొస్తే హ‌రిహ‌ర‌న్‌-ఎంఆర్ అర్జున్ ద్వ‌యం రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement