టోక్యో: ఒలింపిక్స్‌లో అత్యంత అరుదైన పతక ప్రదర్శన నమోదైంది. కనీవినీ ఎరుగని రీతిలో ఒక ఈవెంట్లో ఇద్దరు విజేతలొచ్చారు. వీరికి చెరో బంగారు పతకం అందజేశారు. దీంతో పురుషుల హైజంప్... పసిడి పంచిన ఈవెంట్‌గా రికార్డుల్లోకెక్కింది.
ఖతర్‌కు చెందిన ఇసా ముతజ్ బార్షిమ్, ఇటలీ అథ్లెట్ గ్లాన్‌మార్కో టంబెరి హైజంప్ విజేతలుగా నిలిచారు. వీళ్లిద్దరు 2.37 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. మూడో స్థానం పొందిన మాక్సిమ్ నెడసెకవు (బెలారస్) కూడా 2.37 మీటర్లు జంప్ చేసినప్పటికీ అతని 8 ప్రయత్నాల్లో ఒక ఫౌల్ ఉంది. దీంతో అతనికి కాంస్యం లభించింది. గతంలో 1908 ఒలింపిక్స్ పోల్ వాల్ట్‌లో బంగారు పతకాన్ని ఇద్దరు ఇలాగే పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment