PC: BCCI
టీమిండియా స్పిన్నర్ రాహుల్ శర్మ క్రికెట్‌లో అన్నిరకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా ఆదివారం ప్రకటించాడు. "నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, బీసీసీఐకు ధన్యవాదాలు" అని రాహుల్ ట్విట్ చేశాడు
కాగా బెల్ పాల్సి(ముఖ పక్షవాతం) సమస్యతో భాదపడ్డ రాహుల్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. రాహుల్ శర్మ 2011లో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
అతడు నాలుగు వన్డేలు, రెండు టీ20ల్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అతడు గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నాడు.
కాగా 2010లో డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్) తరపున రాహుల్ శర్మ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతడు ఐపీఎల్‌లో పూణే వారియర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తరపున ఆడాడు. ఐపీఎల్‌లో 44 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ శర్మ.. మొత్తంగా 40 వికెట్లు సాధించాడు. అదే విధంగా రాహుల్ శర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంజాబ్ జట్టు తరపున ఆడాడు.
Thanks to all for ur love and support throughout my journey 😊❤️🇮🇳 @BCCI @BCCIdomestic @IPL #retirement pic.twitter.com/anqBGUSwoa
— Rahul Sharma (@ImRahulSharma3) August 28, 2022
చదవండి: Asia Cup Ind Vs Pak: 'భారత్‌పై గతేడాది విజయాన్ని గుర్తు తెచ్చుకోండి.. ఈ సారి కూడా'
Comments
Please login to add a commentAdd a comment