Ravindra Jadeja: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. అందుకు చాలా సమయం ఉందంటూ(Long Way To Go) ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై దృష్టి సారించేందుకు టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించాడు. అవన్నీ గాలి వార్తలనేనని కొట్టిపారేశాడు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు.
Long way to go💪🏻💪🏻 pic.twitter.com/tE9EdFI7oh
— Ravindrasinh jadeja (@imjadeja) December 15, 2021
కాగా, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా జడ్డూ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆడిన జడేజా.. గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలెక్టర్లు అతన్ని దక్షిణాఫ్రికా పర్యటన(3 టెస్ట్‌ల సిరీస్)కు ఎంపిక చేయలేదు. ముంచేతి గాయానికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న జడేజా.. కోలుకునేందుకు మరో 6 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జడేజా టీమిండియా తరఫున 57 టెస్ట్‌ల్లో 232 వికెట్లు సాధించడంతో పాటు 2195 పరుగులు సాధించాడు.
చదవండి: Kohli-Rohit: కలిసి ఆడకపోతే వాళ్లకే నష్టం.. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు..!
Comments
Please login to add a commentAdd a comment