photo credit: IPL Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏప్రిల్ 23తో ప్రత్యేక అనుబంధం ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ జట్టు వేర్వేరు సీజన్లలో ఏప్రిల్ 23న రెండు ముఖ్యమైన ఐపీఎల్ రికార్డులను నమోదు చేసింది. అవేంటంటే.. 2013 సీజన్‌లో ఈ రోజున ఐపీఎల్ చరిత్రలోనే ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ టీమ్ టోటల్ రికార్డును ఆర్సీబీ నమోదు చేసింది. ఆ సీజన్‌లో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ రికార్డు స్థాయిలో 263 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక టీమ్ టోటల్. ఈ మ్యాచ్‌లోనే మరో ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ విధ్వంసం సృష్టించి రికార్డు స్థాయిలో 175 పరుగులు చేశాడు.
ఇక 2017 సీజన్‌లో ఇదే రోజున ఆర్సీబీ మరో ఐపీఎల్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సారి ఆ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌటైంది.
ఐపీఎల్ హిస్టరీలో నేటికి ఇదే అత్యల్ప స్కోర్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. కేదార్ జాదవ్ చేసిన 9 పరుగులే ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్. ఆర్సీబీ ఏప్రిల్ 23న ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్, వర్స్ట్ రికార్డులను నమోదు చేసిన నేపథ్యంలో ఆ జట్టు ఇవాళ ఆడబోయే మ్యాచ్‌పై జనాల్లో ఆసక్తి పెరిగింది. బెంగళూరు టీమ్ ఇవాళ (ఏప్రిల్ 23) మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. మరి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తుందో లేక చెత్త ప్రదర్శన నమోదు చేసి చతికిలబడుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment