ల‌క్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కార‌ణ‌మిదే! | Reason Why Mumbai Indians Captain Hardik playing Not Playing Vs LSG | Sakshi
Sakshi News home page

ల‌క్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కార‌ణ‌మిదే!

May 4 2026 8:17 PM | Updated on May 4 2026 8:31 PM

Reason Why Mumbai Indians Captain Hardik playing Not Playing Vs LSG

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రుస్తోంది. ఈ సీజ‌న్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ఓట‌ములు చ‌విచూసిన ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవ‌కాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మయ్యాయి. 

ఈ నేపథ్యంలో సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ దూర‌మ‌వ్వ‌డం ప‌లు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ స‌మ‌యంలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ‌చ్చిన‌ సూర్య‌కుమార్‌.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 

ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో  146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్‌లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

జ‌ట్టు ఆట‌గాళ్ల ప‌ట్ల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో చెడ్డ పేరును మూట‌గ‌ట్టుకున్నాడు. ఒక ద‌శ‌లో పాండ్యాను త‌ప్పించి రోహిత్‌కు మ‌ళ్లీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్‌!

Advertisement
 
Advertisement
Advertisement