IPL 2023 RCB Vs KKR: Rinku Singh Touches Virat Kohlis Feet After KKR Beat RCB, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్‌.. ఫోటోలు వైరల్‌

Apr 27 2023 12:59 PM | Updated on Apr 27 2023 2:21 PM

Rinku Singh Touches Virat Kohlis Feet  - Sakshi

PC: twitter

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అంటే అభిమానులకే కాదు క్రికెటర్లకు కూడా ఎంతో ఇష్టం. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా మొదలపెట్టిన చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. 

అతడిని కనీసం ఒక్కసారి కలిస్తే చాలు తమ జన్మ ధన్యం అయిపోతుందని అనుకునే వారు కూడా ఉన్నారు. తాజాగా అది మరోసారి రుజువైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్‌.. కింగ్‌ కోహ్లిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

కోహ్లికి కాలికి రింకూ సింగ్‌ దండం పెట్టాడు.  ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు.

వెంటనే కోహ్లి అతడిని లేపి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి(54) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు.


చదవండి: IPL 2023-Washington Sundar: సన్‌రైజర్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement