IPL 2023: Rohit Sharma Achieves Rare Feat, Second Indian To Play 200 T20s As Captain - Sakshi
Sakshi News home page

Rohit Sharma: టీ20ల్లో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. రెండో భారత క్రికెటర్‌గా!

Published Mon, Apr 3 2023 8:08 PM | Last Updated on Mon, Apr 3 2023 8:25 PM

 Rohit Sharma Achieves Rare Feat, Second Indian to Play 200 T20s as Captain - Sakshi

ఐపీఎల్‌-2023ను ఐదు సార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఓటమితో ఆరంభించింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం అరుదైన ఫీట్‌ సాధించాడు. టీ20ల్లో 200 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

ఆర్సీబీతో మ్యాచ్‌లో సారథ్యం వహించేందుకు మైదానంలో అడుగుపెట్టిన రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఈ ఫీట్‌ సాధించిన జాబితాలో  భారత మాజీ కెప్టెన్‌ ఎంస్‌ ధోని(307 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉండగా.. వెస్టెండీస్‌ మాజీ సారధి(208 మ్యాచ్‌లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కు 143 మ్యాచ్‌ల్లో రోహిత్‌ సారథ్యం వహించాడు. అదే విధంగా ధోని ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు పుణే సూపర్‌ జెయింట్స్‌తో కలిపి 211 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు.
చదవండి: IPL 2023: అ‍య్యో విలియమ్సన్‌.. నిలబడేందుకు కూడా కష్టం! వరల్డ్‌కప్‌కు అనుమానమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement