రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా | Rohit Sharma becomes India s leading six hitter in T20 World Cup | Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా

Published Thu, Oct 27 2022 1:58 PM | Last Updated on Thu, Oct 27 2022 2:08 PM

Rohit Sharma becomes India s leading six hitter in T20 World Cup - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బాదిన భారత క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్‌.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ ఓవరాల్‌గా 34 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(34) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో యువీ రికార్డును హిట్‌ మ్యాన్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రిస్‌ గేల్‌(63) ఉన్నాడు. 

అదే విధంగా ఈ మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ మరో రికార్డును సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌ 903 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్ధనే 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.  ఇక ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధిం‍చాడు.


చదవండిT20 WC 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. అగ్ర స్థానంలోకి ప్రోటీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement