రాజ్‌కోట్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో కంగారూలపై తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా కోరిక నెరవేరలేదు. కాగా తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత జట్టు.. సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు నలుగురు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
మిచెల్ మార్ష్ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (61 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), లబుషేర్‌న్ (58 బంతుల్లో 72; 9 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుత ఇన్సింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ రెండు, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(81), విరాట్ కోహ్లి(56), శ్రేయస్ అయ్యర్(48) పరుగులతో రాణించినప్పటికి.. జట్టుకు ఓటమి మాత్రం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు జోష్ హాజిల్ వుడ్ రెండు, స్టార్క్, గ్రీన్, కమ్మిన్స్, సంగా తలా వికెట్ సాధించారు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
బుమ్రా అద్భుతం..
"ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతీ మ్యాచ్‌లోనూ ఈ విధంగానే ఆడటానికి ప్రయత్నిస్తాను. ఇక ఆఖరి మ్యాచ్‌లో ఓటమి పాలైనందుకు నాకు ఎటువంటి బాధలేదు. ఎందుకంటే గత ఏడు ఎనిమిది వన్డేల్లో మేము బాగా ఆడాము. అద్భుత విజయాలు సాధించాము. విభిన్న పరిస్థితులు, వేర్వేరు జట్లతో ఆడాము.
మేము అన్ని సవాళ్లను స్వీకరించాం. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో మేము ఆశించిన ఫలితం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు బుమ్రా ప్రదర్శన నన్ను ఎంతగానో అకట్టుకుంది. ముఖ్యంగా అతడు తన రిథమ్‌ను ఏ మాత్రం కోల్పోలేదు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు ఇదే ఫిట్‌నెస్‌తో వరల్డ్‌కప్‌లో కూడా అదరగొట్టాలని కోరుకుంటున్నాను.
వరల్డ్‌కప్‌కు సంబంధించిన 15 మంది జట్టు సభ్యులపై మాకు ఒక సృష్టత ఉంది. మాకు ఎటువంటి గందరగోళం లేదు. జట్టులో ప్రతీ ఒక్క ప్లేయర్ తమ వంతు పాత్ర పోషించాలని మేము ఆశిస్తున్నాం. అప్పుడే మేము ఛాంపియన్స్‌గా నిలుస్తాం. అదే విధంగా ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఎందకంటే ఫిటెస్ చాలా ముఖ్యం కాదా" అని రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment