ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గాయం కారణంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడినప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మెహది హసన్ రెండు, ముస్తిఫిజర్, మహ్మదుల్లా తలా వికెట్ సాధించారు.
అదరగొట్టిన మెహది, మహ్మదుల్లా
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 69 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆతిథ్య జట్టును మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో మెహిదీ హసన్ అజేయ శతకంతో మెరవగా.. మహ్మదుల్లా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IND Vs BAN: భారత్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్ల సరి కొత్త చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment