Ind Vs Aus, 3rd T20: Rohit Sharma Gets Angry On Dinesh Karthik, Then Kisses Him On Helmet, Video Viral - Sakshi
Sakshi News home page

IND vs Aus: కార్తీక్‌పై మరోసారి ‘సీరియస్‌’ అయిన రోహిత్‌.. కానీ ఈసారి ముద్దుపెట్టి మరీ!

Published Sun, Sep 25 2022 10:23 PM | Last Updated on Mon, Sep 26 2022 9:18 AM

Rohit Sharma Gets Angry On Dinesh Karthik, Then Kisses Him On Helmet - Sakshi

హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత ఆటగాడు అక్షర్‌ పటేల్‌ సంచలన త్రోతో మెరిశాడు. దాదాపు బౌండరీ లైన్‌ వద్ద నుంచి డైరక్ట్‌ త్రోతో మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ రనౌట్‌ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. 

ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ చాహల్‌ వేసిన  8 ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ ఫైన్‌లెగ్‌ దిశగా ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద బాల్‌ అందుకున్న అక్షర్‌ పటేల్‌.. వెంటనే స్ట్రైక్‌ర్‌ ఎండ్‌ వైపు త్రో చేశాడు.

అయితే ఎవరూ ఊహించని విధంగా బంతి నేరుగా వి​కెట్లను తాకింది. వెంటనే భారత ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీలు చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. అయితే రిప్లేలో బంతి వికెట్లకు తాకేముందు.. వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ సైతం తన గ్లౌవ్స్‌ తాకించండంతో ఒక బెయిల్‌ పైకి లేచింది.

అయితే బంతి తాకిన తర్వాత రెండో బెయిల్‌ కూడా లేచింది. దీన్ని పరిగణలోకి తీసుకుని థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ మాత్రం అంపైర్‌ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రౌండ్‌ను వీడాడు.

మరోసారి రోహిత్‌-కార్తీక్‌ బ్రోమాన్స్‌
కాగా తొలుత కార్తీక్‌ తన గ్లౌవ్స్‌ను వికెట్‌ తాకించడంపై రోహిత్‌ కాస్త సీరియస్‌గా కనిపించాడు. అయితే థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించిన అనంతరం రోహిత్‌ కాస్త కూలయ్యాడు. వెంటనే  కార్తీక్‌ హెల్మట్‌ను ముద్దాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: IND vs AUS: టీమిండియాపై గ్రీన్‌ సరికొత్త చరిత్ర.. తొలి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement