ఆసియా కప్ 2023కు టీమిండియా సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వగా.. యువ సంచలనం తిలక్ వర్మకు తొలిసారి వన్డే జట్టులో చోటుదక్కింది. ఢిల్లీలోని జరిగిన సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపికచేసింది.
ఈ మీటింగ్‌లో భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొనున్నారు. ఇక జట్టు ఎంపిక అనంతరం ఛీప్ సెలక్టర్ అగార్కర్, రోహిత్ శర్మ విలేకురల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆసియాకప్‌కు ఎంపిక చేసిన జట్టులో టాపర్డర్‌లో పార్ట్‌టైమ్ బౌలింగ్ అప్షన్స్ తక్కువగా ఉన్నయంటూ రోహిత్‌ను విలేకరులు ప్రశ్నించారు.
మేము కూడా బౌలింగ్ చేస్తాం..
అందుకు బదులుగా.. "అయితే ప్రపంచకప్‌లో శర్మ, కోహ్లి కూడా బౌలర్లకు సాయం చేస్తారని" సరదగా వాఖ్యనించాడు. వెంటనే అజిత్ అగార్కర్ స్పందించి మేము వారిద్దరిని బౌలింగ్ వేసేందుకు ఒప్పించాము అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు.
ఇందుకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆసియాకప్‌కు ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్లు, ముగ్గురు స్పిన్నర్లు, నలుగురు పేసర్లు ఉన్నారు.
ఆసియా కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.
చదవండి: CSK To Release Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం.. 16 కోట్ల ఆటగాడికి గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment