
రోహిత్ శర్మ- సూర్యకుమార్ యాదవ్( Photot Credit: IPL/BCCI)
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ముంబై సారథి రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీల నేపథ్యంలో తనపై వర్క్‌లోడ్, గాయాల బెడదను తగ్గించుకోవడం కోసం రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ తన నిర్ణయాన్ని ముంబై మెనెజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రోహిత్ అందుబాటులో లేని మ్యాచ్‌లకు ముంబై సారథిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.
అదే విధంగా రోహిత్ గైర్హాజరీ మ్యాచ్‌ల్లో ముంబై ఓపెనర్‌గా కామెరూన్ గ్రీన్ బరిలోకి దిగనున్నట్లు పలునివేదికలు వెల్లడించాయి. ఇక ఐపీఎల్16వ సీజన్ శుక్రవారం(మార్చి31) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న బెంగళూరు వేదికగా ఆర్సీబీతో ఆడనుంది.
చదవండి: IPL 2023: ఈసారి గెలిచేది ఆ జట్టే! అంతలేదు కేకేఆర్ ఫ్యాన్‌గా చెప్తున్నా ట్రోఫీ సన్‌రైజర్స్‌దే!
Comments
Please login to add a commentAdd a comment