
ఆదివారం(ఆక్టోబర్ 2) గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు గౌహతి డీసీపీ పొంజిత్ దోవరా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పొంజిత్ దోవరా ఆక్టోబర్1న ట్విటర్‌లో షేర్ చేశారు.
"ఆల్ ది బెస్ట్ రోహిత్, కచ్చితంగా సెంచరీ సాధించాలి" అని క్యాప్షన్‌గా పెట్టారు. అయితే అతను చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సోసల్ మీడియాలో హాల్ చల్ చేసింది. కాగా అతడు ఈ ఫోట్‌ను షేర్ చేసినప్పటి నుంచి 11, 000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది.
ఇకఈ ఫోటోలో డీసీపీ పక్కన రోహిత్ నిలబడి ఉన్నాడు. అయితే రోహిత్ మాత్రం సీరియస్‌గా ఉన్నట్లు ముఖం పెట్టాడు. దీంతో ఈ పోస్ట్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. 'నా ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మను అరెస్టు చేయవద్దు' అంటూ కామెంట్ చేశారు. మరో యూజర్ 'రోహిత్ ఎందుకు సీరియస్‌గా ఉన్నావు? అక్కడ మీరు అరెస్టు చేయబడినట్లు నిలుచుని ఉన్నారు' అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: T20 World Cup 2022: అంపైర్‌ల జాబితా ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
Best of luck. Ek century ban ta hein. @ImRo45 pic.twitter.com/SDsZMF1fY0
— Ponjit Dowarah (@ponjitdowarah) October 1, 2022
Comments
Please login to add a commentAdd a comment