Photo Credit: Twitter
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మెస్సీ రిటైర్మెంట్‌పై రొనాల్డో స్పందించింది ఇప్పుడు కాదు. పదేళ్ల క్రితం 2016లో తొలిసారి మెస్సీ అనూహ్యంగా వీడ్కోలు పలకడంపై రొనాల్డో మద్దతు పలికాడు.
ఆనాడు మెస్సీ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. "మెస్సీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులు అతడి పరిస్థితిని, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. అతడికి ఓటములు, నిరాశలు అలవాటు లేవు. రెండో స్థానంలో నిలవడాన్ని కూడా అతడు ఇష్టపడడు. పెనాల్టీ మిస్ అయినంత మాత్రాన అతడు చెడ్డ ఆటగాడు అయిపోడు. మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే బాధగా ఉంది. అతడు తిరిగి తన దేశం తరఫున ఆడాలని ఆశిస్తున్నాను. అర్జెంటీనాకు అతడు అవసరం" అని రొనాల్డో అప్పట్లో వ్యాఖ్యానించాడు.

Photo Credit: Twitter
మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకడంతో రొనాల్డో పదేళ్ల నాటి పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. మెస్సీ తాజా వీడ్కోలుపై రొనాల్డో ఇప్పటివరకైతే స్పందించలేదు. ప్రస్తుతం అతడు సౌదీ అరేబియా క్లబ్ అల్-నస్ర్ తరఫున ఆడుతూ బిజీగా ఉన్నాడు. మెస్సీ రిటైర్మెంట్ నేపథ్యంలో తన ట్రెయినింగ్ ఫొటోను పంచుకున్న రొనాల్డో "కీప్ పుషింగ్" అని క్యాఫ్షన్ జత చేశాడు.
మెస్సీని ఉద్దేశించే రొనాల్డో ఆ క్యాప్షన్ పెట్టాడని, "ముందుకు సాగుదాం" అన్నట్లుగా అర్ధం వచ్చేలా రొనాల్డో కామెంట్ ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే పదేళ్ల క్రితం రొనాల్లో మెస్సీకి మద్దతుగా నిలుస్తూనే కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశించాడు.
అతడు ఆశించినట్లే తిరిగివచ్చిన మెస్సీ ఫుట్‌బాల్‌లో అద్భుతాలు సృష్టించాడు. 2021, 2024లో అర్జెంటీనాకు కోపా అమెరికా కప్‌ను అందించిన మెస్సీ.. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిపా ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు అందించి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు.
రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ ఈసారి మాత్రం తిరిగి రాడన్న సంగతి అభిమానులకు అర్థమయ్యింది. దీంతో ఈతరం గొప్ప ఆటగాళ్లలో రొనాల్డో మిగిలాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్‌లు ఆడినప్పటికీ, పోర్చుగల్‌కు ఫిఫా టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. తాజాగా మెస్సీ రిటైర్మెంట్ నేపథ్యంలో రొనాల్డో కూడా తన వీడ్కోలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నాడనే వార్తలు వస్తున్నాయి. కానీ రొనాల్డో మాత్రం ఇప్పటివరకు తన అంతర్జాతీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Read: 40 బంతుల్లోనే శతకం.. విండీస్ హిట్టర్ ప్రపంచ రికార్డు


