ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌.. ఇది ఔటా? | RR Fans Trolled Third Umpire Decision On Samsons Out | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌.. ఇది ఔటా?

Published Sat, Oct 3 2020 4:17 PM | Last Updated on Sun, Oct 4 2020 4:40 PM

RR Fans Trolled Third Umpire Decision On Samsons Out - Sakshi

శాంసన్‌ క్యాచ్‌ను చహల్‌ అందుకునే దృశ్యం(ఫోటో కర్టసీ: ట్విట్టర్‌)

అబుదాబి:  రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌.. టాపార్డర్‌ ఆటగాళ్లైన స్టీవ్‌ స్మిత్‌(5), జోస్‌ బట్లర్‌(22), సంజూ శాంసన్‌(4) వికెట్లను ఐదు ఓవర్లలోపే కోల్పోయింది. ఇసుర ఉదాన వేసిన మూడో ఓవర్‌ నాల్గో బంతికి స్మిత్‌ బౌల్డ్‌ కాగా, కాసేపటికి సైనీ బౌలింగ్‌లో బట్లర్‌ పెవిలియన్‌ చేరాడు. దేవదూత్‌ పడిక్కల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో బట్లర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక సంజూ శాంసన్‌ కూడా విఫలయ్యాడు. దాంతో 31 పరుగులకే రాజస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. (చదవండి: అప్పుడు ట్రోల్‌ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా!)

ఫస్ట్‌ బాల్‌కే  వికెట్‌..
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో భాగంగా తన తొలి ఓవర్‌ను వేసిన ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌.. వచ్చీ రావడంతోనే మంచి బ్రేక్‌ ఇచ్చాడు. తన ఓవర్‌లో తొలి బంతికే డేంజరస్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ను ఔట్‌ చేశాడు. చహల్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడబోయిన సంజూ.. రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, ఈ క్యాచ్‌ను పట్టే క్రమంలో కాస్త సందిగ్థం నెలకొంది. చహల్‌ బంతిని గ్రౌండ్‌కు టచ్‌ చేశాడా అనే దానిపై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వెళ్లారు ఫీల్డ్‌ అంపైర్లు. అయితే పలు కోణాల్లో ఆ క్యాచ్‌ను పరిశీలించిన తర్వాత బంతి గ్రౌండ్‌కు టచ్‌ కాలేదని థర్డ్‌ అంపైర్‌ తేల్చాడు.. బంతి క్రింద చహల్‌ వేళ్లు ఉన్నాయని తేల్చిన థర్డ్‌ అంపైర్‌ అది ఔట్‌గా ప్రకటించాడు. కానీ బంతి గ్రౌండ్‌కు తగిలినట్లు కొన్ని కోణాలు కనబడింది. ఇది ఔటా అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ అభిమానులు ట్రోల్స్‌ చేస్తున్నారు. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అనేది బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా ఉండాలి కానీ ఇలా ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement