రుతురాజ్ గైక్వాడ్(ఫైల్‌ఫోటో)
షార్జా: ఐపీఎల్-13లో అరంగేట్రం చేసిన రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డక్ అయ్యాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు.రాజస్తాన్ స్పిన్నర్ తెవాతియా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన గైక్వాడ్ స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా అరంగేట్రం ఐపీఎల్ మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా అవుటైన జాబితాలో చేరిపోయాడు. తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి సామ్ కరాన్ స్టంపౌట్ అవ్వగా, ఆ తర్వాత బంతికే రుతురాజ్ గైక్వాడ్ అదే తరహాలో నిష్క్రమించాడు. దాంతో సీఎస్‌కే 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు మురళీ విజయ్(21), షేన్ వాట్సన్(33)లు ఔటయ్యారు.
రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మురళీ విజయ్-వాట్సన్‌లు దూకుడుగా ఆడారు. వాట్సన్ నాలుగు సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. ఇక విజయ్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కాగా, వీరి ఇన్నింగ్స్‌కు 56 పరుగుల వద్ద తెరపడింది. వాట్సన్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, కాసేపటికి విజయ్ ఔటయ్యాడు. ఆపై సామ్ కరాన్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మంచి ఊపుమీద కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. గైక్వాడ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చెన్నై కష్టాల్లో పడింది.(చదవండి: సంజూ శాంసన్ చితక్కొట్టుడు..)
Comments
Please login to add a commentAdd a comment