PC: IPL.com
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ దిశగా రాజస్తాన్ రాయల్స్ అడుగులు వేస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
ఇక కేకేఆర్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యశస్వీ జైశ్వాల్, యజువేంద్ర చాహల్‌పై సంజూ ప్రశంసల వర్షం కురిపించాడు.
అతడొక లెజెండ్..
"ఈ మ్యాచ్‌లో నేను చేసింది ఏమీ లేదు. నాన్‌స్ట్రైకర్ నుంచి జైశ్వాల్ ఇన్నింగ్స్ చూసి ఎంజాయ్ చేశాను. పవర్‌ప్లేలో యశస్వీ ఎలా ఆడుతాడో ప్రత్యర్ధి బౌలర్లకు సైతం తెలుసు. పవర్‌ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అటువంటి ఆటగాడు మాకు దొరకడం మా అదృష్టం. ఇక చాహల్ అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహంలేదు.
చదవండి: #Yashasvi Jaiswal: వాట్ ఏ టాలెంట్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే: విరాట్ కోహ్లి
తాను ఎంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడొక లెజెండ్. ఫ్రాంచైజీలో చాహల్ వంటి స్పిన్నర్ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాహల్‌కు నేను ఎటువంటి సూచనలు చేయాల్సిన అవసరం లేదు. బంతితో ఏమి చేయాలో అతడికి బాగా తెలుసు. యుజీకి డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా ఉంది.
కెప్టెన్‌గా నాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాహల్ చేస్తున్నాడు. ఇక ప్లేఆఫ్స్‌కు చేరడానికి మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రతీ మ్యాచ్ కూడా మాకు కీలకం. ఇదే ఫలితాన్ని రాబోయే మ్యాచ్‌ల్లో పునరావృతం చేసి ప్లేఆఫ్స్‌లో అడుగు పెడతామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సంజూ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జైశ్వాల్(98) పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
చదవండి: # Nitish Rana: నువ్వేమన్నా నెం.1 బౌలర్ అనుకున్నావా.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ
Comments
Please login to add a commentAdd a comment