PC: BCCI/X
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హోప్ తొలుత కాస్త ఆచితూచి ఆడాడు. సింగిల్స్ తీస్తూ తన సహచర ఆటగాడు జాన్ క్యాంప్‌బెల్‌కు స్టైక్ ఇచ్చాడు.
అయితే క్యాంప్‌బెల్ ఔటయ్యాక హోప్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో శైలిలో భారత బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో హోప్ 90 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ కరేబియన్ వీరుడికి ఇది వన్డేల్లో 20వ సెంచరీ కావడం గమనార్హం.
లారా రికార్డు బ్రేక్
తద్వారా హోప్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో వెస్టిండీస్ ప్లేయర్‌గా హోప్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా తన వన్డే కెరీర్‌లో 19 సెంచరీలు సాధించాడు. తాజా సెంచరీతో లారా ఆల్‌టైమ్ రికార్డును హోప్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(25) అగ్రస్థానంలో ఉన్నాడు.
ధోని వరల్డ్ రికార్డ్ బ్రేక్
అదేవిధంగా వన్డేల్లో వికెట్ కీపర్-కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఎంఎస్ ధోని రికార్డ్‌ను హోప్ బ్రేక్ చేశాడు. ధోని వికెట్ కీపర్-కెప్టెన్‌గా తన కెరీర్‌లో 6 సెంచరీలు చేయగా.. హోప్ 7 శతకాలు నమోదు చేశాడు.
వన్డేల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్లు వీరే
25 – క్రిస్ గేల్
20 – షాయ్ హోప్
19 – బ్రయాన్ లారా
17 – డెస్మండ్ హేన్స్
చదవండి: IND vs WI: టీమిండియాకు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన స్టార్


