లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొత్త రికార్డును అందుకున్నాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్( వర్సెస్ న్యూజిలాండ్ , అహ్మదాబాద్, 2010); భువనేశ్వర్ కుమార్( వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్‌హమ్, 2014); వృద్ధిమాన్ సాహా( వర్సెస్ న్యూజిలాండ్, కోల్‌కతా, 2016) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఓవల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమైన చోట శార్దూల్ 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. 72 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌లో ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్ 336 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుమ్రా 9, ఉమేశ్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు.
చదవండి: Kohli Frustration: ఔటయ్యానన్న కోపంలో గోడను కొట్టిన కోహ్లి
ENG Vs IND: బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ
We Call Him "LORD SHARDUL" For A Reason😌💙💙💙...Fearless & Aggressive😎💙💙💙...Well Played @imShard 🙌🏻💙...#LordShardul #ShardulThakur #ENGvINDpic.twitter.com/PsYueXD2WD
— Bitan Sangram (@IAmBitan45) September 2, 2021
Indian No.8 or lower batsmen scoring two 50+ scores in a Test match:
— Umang Pabari (@UPStatsman) September 5, 2021
Harbhajan Singh v NZ, Ahmedabad, 2010
Bhuvneshwar Kumar v Eng, Nottingham, 2014
W Saha v NZ, Kolkata, 2016
Shardul Thakur v Eng, The Oval, 2021*#ENGvIND
Lord shardul 🙏🙏#INDvENG #BCCI @imShard pic.twitter.com/yJEtRlBsgR
— Don Abhimanyu (@DonAbhimanyu_) September 5, 2021
Comments
Please login to add a commentAdd a comment