బంగ్లా బౌలర్‌ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్‌ | Shoriful Islam 7-Wkts-Australia-210-All-Out-Restricts-Lead- just 146 Runs | Sakshi
Sakshi News home page

బంగ్లా బౌలర్‌ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్‌

Aug 23 2026 7:19 AM | Updated on Aug 23 2026 8:09 AM

Shoriful Islam 7-Wkts-Australia-210-All-Out-Restricts-Lead- just 146 Runs

Photo Credit: Twitter

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌ బౌల‌ర్ షోరిఫుల్ ఇస్లామ్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. మాకే వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో షోరిఫుల్ 7 వికెట్ల‌తో చెల‌రేగాడు. ఫ‌లితంగా ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 210 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (67) కీల‌క అర్ధ‌సెంచ‌రీతో రాణించ‌గా, స్టీవ్ స్మిత్ (42) ప‌ర్వాలేద‌నిపించాడు. 

ఆఖ‌ర్లో నాథ‌న్ లియోన్ (32 నాటౌట్‌) బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బంగ్లా బౌల‌ర్ల‌లో షోరిఫుల్ ఇస్లామ్ 7 వికెట్లు తీయ‌గా, త‌స్కిన్ అహ్మ‌ద్‌, తైజుల్ ఇస్లామ్‌, మెహ‌దీ హ‌స‌న్ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం త‌మ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 19 ప‌రుగుల‌కు రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ న‌జ్ముల్ 12, తంజిద్ హ‌స‌న్ (8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు క‌న‌బ‌రుస్తూ రెండు వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ 125 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

రెండో బౌలర్‌గా రికార్డు
ఇక ఏడు వికెట్ల‌తో మెరిసిన షోరిఫుల్ ఇస్లామ్‌కు ఇదే తొలి ఐదు వికెట్ల హాల్ కావ‌డం విశేషం. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన రెండో బౌల‌ర్‌గా షోరిఫుల్ నిలిచాడు. ఆసీస్ గ‌డ్డ‌పై ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసిన తొలి బౌల‌ర్‌గా హ‌స‌న్ మ‌హ్ముద్ నిలిచాడు. డార్విన్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులోనే హ‌స‌న్ మ‌హ్ముద్ (6/55) ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

టెస్టుల్లో బంగ్లాదేశ్ పేస‌ర్ల అత్యుత్త‌మ గ‌ణాంకాలు
👉షోరిఫుల్ ఇస్లామ్ (7/48) 2026లో ఆస్ట్రేలియాపై
👉షాహ‌ద‌త్ హొసెన్ (6/27) 2008లో సౌతాఫ్రికాపై
👉ఎబాద‌త్ హొసెన్ (6/46) 2022లో న్యూజిలాండ్‌పై
👉హ‌స‌న్ మ‌హ్ముద్ (6/55) 2026లో ఆస్ట్రేలియాపై
👉త‌స్కిన్ అహ్మ‌ద్ (6/64) 2024లో వెస్టిండీస్‌పై

 

Read: ‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement