IPL 2026: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌ | Shreyas Iyer becomes 1st captain to be fined in IPL 2026 Know Why | Sakshi
Sakshi News home page

IPL 2026: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌

Apr 1 2026 11:20 AM | Updated on Apr 1 2026 12:22 PM

Shreyas Iyer becomes 1st captain to be fined in IPL 2026 Know Why

గతేడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-2026లో తమ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూ చంఢీగగడ్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

నామమాత్రపు స్కోరు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (39), జోస్‌ బట్లర్‌ (38), గ్లెన్‌ ఫిలిప్స్‌ (25) ఓ మోస్తరుగా రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాక్‌ మూడు వికెట్లు తీయగా.. యజువేంద్ర చహల్‌ రెండు, మార్కో యాన్సెన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

కూపర్‌ కన్నోలి మెరుపులు
ఇక లక్ష్య ఛేదనలో పంజాబ్‌ ఆరంభంలోనే తడబడినప్పటికీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 37 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కూపర్‌ కన్నోలి (Cooper Connolly) 44 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. కన్నోలి మెరుపుల కారణంగా పంజాబ్‌ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

భారీ జరిమానా
ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (18) మాత్రం నిరాశపరిచాడు. తాను విఫలమైనా.. జట్టు గెలుపొందడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న అయ్యర్‌ (Shreyas Iyer Fined)కు భారీ షాక్‌ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున అతడికి పెద్ద ఎత్తున జరిమానా పడింది.

ఇందుకు సంబంధించి ఐపీఎల్‌ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకుగానూ పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు జరిమానా విధించడమైనది. సీజన్‌లో ఇదే తొలి తప్పిదం కాబట్టి  ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.

చదవండి: IPL 2026: మూగబోయిన బ్యాట్‌.. విధ్వంస వీరుడికి ఏమైంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement